AP Cabinet: పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్న సబ్ కమిటీ..! 25 d ago
ఏపీ కేబినెట్ సబ్ కమిటీ బుధవారం ఉ.11 గంటలకు భేటీ కానుంది. మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. నార్కోటిక్ డ్రగ్స్ నియంత్రణ చర్యలపై..పలు కీలక నిర్ణయాలను సబ్ కమిటీ తీసుకోనుంది. సీఎం చంద్రబాబు బుధవారం మ.12:30కి మారిటైం పాలసీపై సమీక్షించనున్నారు. అలాగే సా.4 గంటలకు ఎలక్ట్రిక్ వాహనాల పాలసీపై సమీక్ష చేయనున్నారు. అనంతరం సా.5 గంటలకు నారావారిపల్లెకు చంద్రబాబు బయల్దేరనున్నారు.